YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అసౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ అంగన్ వాడీలు

అసౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ అంగన్ వాడీలు

అసౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ అంగన్ వాడీలు
గుంటూరు,
అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు తిష్ట వేశాయి. మౌలిక సౌకర్యాలు పూర్తిగా కొరవడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవటంతో మారుమూల ప్రాంతాల్లో అంగన్‌ వాడీ కేంద్రాలు తెరుచుకోవటం లేదు. అంగన్‌ వాడీ కేంద్రాల వద్ద తయారు చేసే ఆహారం  పరిశుభ్రత లోపించింది. సామగ్రి నిల్వ చేసుకొనేందుకు సరైన  సౌకర్యాలు కేంద్రాల్లో ఉండటం లేదు.పలు కేంద్రాలు కనీసం విద్యుత్‌ సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఇరుకు గదులు, రేకుల షెడ్డులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పౌష్టికాహారం పలు కేంద్రాల్లో సక్రమంగా అందటం లేదు.3–6 సంవత్సరాల పిల్లలకు 100 మిల్లీ గ్రాముల పాలు, 50 గ్రాముల బాలామృతం ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలు, రక్త హీనత లేకుండా రాగి జావ, చిక్కి వంటివి అందజేయాలి.బరువు తక్కువగా ఉన్న పిల్లలకు గోరుముద్దల  ద్వారా అదనపు ఆహారం అందివ్వాలి. చాలా కేంద్రాల్లో కోడిగుడ్లు సరిగా పంపిణీ కావడం లేదనే ఆరోపణలు, పౌష్టికాహారం సరిగా అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలను చైతన్యం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో సమావేశాలు సక్రమంగా జరగటం లేదు. పలు కేంద్రాల్లో అంగన్‌ వాడీ కేంద్రాల్లో  స్టాకుల్లో తేడాలు ఉన్నట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో  బయటపడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుపట్టికలో సైతం తేడాలు ఉన్నట్టు గుర్తించారు. పిల్లలు హాజరు తక్కువగా ఉన్నా,  పూర్తి స్థాయిలో అందరూ హాజరు అయినట్టు చూపుతున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా  కొరవడింది. అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్‌లు 15 రోజుల కొకసారి తనిఖీ చేయాలి. సీడీపీఓలు రెండు నెలలకొక సారి తనిఖీ నిర్వహించాలి.  ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలను విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. మొత్తం 13 కేంద్రాలను పరిశీలించగా వాటిలో రెండు కేంద్రాలు అసలు తెరవలేదు. రెండు కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం లేదని గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం లోపించింది. మరుగుదొడ్ల  సౌకర్యం లేదు.మాతా, శిశు మరణాలను తగ్గించటంలో భాగంగా, అంగన్‌వాడీలలో గర్భవతులకు  పౌష్టికాహారంతో పాటు 200 మిల్లీలీటర్ల పాలు,  అన్నం పప్పు, కూరగాయలతో కూడిన భోజనం కోడిగుడ్డు అందించాలి.  ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భవతులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి, వారిని చైతన్యపరచాలి. బాలింతలు ఆరు నెలల వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం వంటి వాటిపై  సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్య పరచాలి. ఈ కార్యక్రమాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు కావటం లేదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు మినీ భోజనంతో పాటు, 100 మిల్లీ గ్రాములు, ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. 

Related Posts