YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆమెకు 40... పిల్లలు 44

ఆమెకు 40... పిల్లలు 44

ఆమెకు 40... పిల్లలు 44
న్యూఢిల్లీ, 
ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలను పోషించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెను అలాగే వదిలేస్తే అర్థ శతకం చేస్తుందని భావించిన ప్రభుత్వం.. ఇక పిల్లలను కనడం ఆపాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు సైతం అప్రమత్తమయ్యారు. ఆమె గర్భాశయాన్ని తొలగించాలని ఆదేశించింది.ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 44 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా ఆమెకు పుట్టిన బిడ్డలే. పిల్లలను కనాలంటే కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. మరి 40 ఏళ్ల వయస్సులో 44 మంది ఎలా కనేసింది? ఇది ఫేక్ అనుకుంటున్నారా? అయితే, ఆమెకు ఉన్న సమస్య గురించి తెలుసుకోవల్సిందే. మరియంకు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది. 13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని, భవిష్యత్తులో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు. చివరికి వైద్యులు చెప్పినట్లే జరిగింది. ఆమె గర్భాశయంలో ఒకేసారి అనేక అండాలు విడుదల కావడం వల్ల ఆమెకు ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున జన్మించారు.తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత 5 సార్లు కవలలు, ఏడు సార్లు ముగ్గురేసి, ఐదుసార్లు నలుగురేసి పిల్లలకు జన్మనిచ్చింది. అలా 40 మందికి ఆమె జన్మనిచ్చింది. వీరిలో కొందరు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు. మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఆ 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది.రోజుకు సుమారు 25 కిలోల గోదుమ పిండి ఖర్చవుతుందని వెల్లడించింది. వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది. మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని తెలిపింది. అయితే, తన గర్భాశయం తొలగించడం అంత సులభమైన పని కాదని వైద్యులు చెప్పారని తెలిపింది. తన భర్త ఈ 38 మంది పిల్లలే కాకుండా వేర్వేరు మహిళలతో ద్వారా 45 మందిని కన్నాడని పేర్కొంది.చిత్రం ఏమిటంటే.. ఆ 38 పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. స్కూల్‌కు పంపి చదివిస్తోంది. ఆ ఇంట్లో గోడలపై మెడల్స్ సాధించిన తన చిన్నారుల ఫొటోలు గర్వంగా పలకరిస్తాయి. ఈమె పరిస్థితి చూసి ప్రభుత్వం ఆదుకోడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. ఇకపై పిల్లలను కనకూడదనే షరతు విధించింది. ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి. అక్కడ సంతాన నియంత్రణపై ప్రజలకు కనీస అవగాహన ఉండదు. ఫలితంగా అక్కడ జనాభాతోనే పేదరికం కూడా బాగా పెరుగుతోంది.

Related Posts