YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎవ్వరికి అర్థం కాని కేకే వ్యవహారం

ఎవ్వరికి అర్థం కాని కేకే వ్యవహారం

ఎవ్వరికి అర్థం కాని కేకే వ్యవహారం
హైద్రాబాద్, 
టీఆర్ఎస్‌లో కేశవరావు వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేకే లేఖ రాయడం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. తాను కార్మిక పక్షపాతి అని.. రాజ్యం ప‌క్షాన ఉండ‌బోన‌ని, సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతామంటూ అంటూ  రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ప్రెస్ నోట్, చిట్ చాట్‌లతో సంచలనం సృష్టించారు. గ‌త కొన్నేళ్లుగా సైలెంట్ ఉన్న కేశవరావు ఇప్పుడు స‌డెన్‌గా తెర‌పైకి రావ‌డం, ప్ర‌భుత్వాన్ని ఇ బ్బంది పెడుతున్న ఆర్టీసీ స‌మ్మెపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తానంటూ కామెంట్లు చేయ‌డం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిట‌ని నేత‌లు చ‌ర్చింకుంటున్నారు. అయితే తన రాజ్యసభ సీటు పదవి రెన్యూవల్ విషయంలో గులాబీ బాస్ నుండి స్పష్టత రాక‌పోవ‌డం వ‌ల్లే కేకే తెగ హ‌డావిడి చేస్తున్నాడంటూ సీనియ‌ర్ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.2014 ఏప్రిల్ లో రాజ్యసభకు కేకే ఎన్నికయ్యారు. 2020 ఏప్రిల్ లో ఆయన పదవీకాలం ముగుస్తోంది. దీంతో పదవి రెన్యూవల్‌ కోసం ఆయ‌న కేసీఆర్‌ ను కలిసిన‌ట్లు స‌మాచారం. అయితే సీఎం నుంచి సానుకూలంగా స్పంద‌న రాలేదని తెలుస్తోంది. దీంతో కేకే తన దారి తాను చూసుకుంటున్నారని వార్తలు గుప్ పుమంటున్నాయి. ఈక్ర‌మంలోనే ఆయన టీఆర్ ఎస్‌ను వీడుతార‌నే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ‌లో బీజేపీ ఇప్ప‌టికే కాపు వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ త‌న వైపున‌కు తిప్పుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.అయితే టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతుందని ప్ర‌చారం జ‌రుగుతున్నా ఇది సాధ్య‌ప‌డ‌దు. ఇక కేకేపై సైతం క‌మ‌ల‌ద‌ళం వ‌ల‌వేసింద‌ని.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌తో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు చ‌ర్చ‌లు జరి పారని…ఆయన త్వ‌ర‌లోనే కారు దిగి, క‌మ‌లం గూటికి చేరుతార‌నే ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి రాజ్యసభ సీటు రెన్యూవల్‌ కోసం కేకే లేఖల అస్త్రాన్ని వదిలారని పార్టీలో చర్చ నడుస్తోంది.ఇటు కేకే తాజా ప్రకటనలతో వెంటనే అలర్టైన గులాబీ బాస్‌…ఆయన ఇత‌ర ఆలోచ‌న‌లు చేయ‌క‌ముందే  బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌కు పిలిపించి ఇప్పటికే సుధీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కేసీఆర్ బుజ్జగింపులతో కేకే మెత్తబడ్డారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Related Posts