తప్పుల తడకగా భూ ప్రక్షాళన
మహబూబ్ నగర్ ,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో చోటు చేసుకున్న తప్పులు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినా అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయకపోవడంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు చేతికి రాకపోగా రైతుబంధు పథకానికీ దూరమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారితో పాటు పార్ట్–బీ(వివాదాస్పదమైనవి)లో ఉన్న భూముల విషయం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూరిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టగా ఆశించిన ఫలితాలు రాలేదు. రికార్డుల ప్యూరిఫికేషన్ అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న తప్పులను సవరించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాధారణ విధులకు దూరమైన అధికారుల తీరుతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని సగంలోనే వదిలి అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు ‘ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నాం.. ఆగాల్సిందే’ అన్న సమాదానం వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టర్ కార్యాలయానికి పట్టాదారు పాస్‌పుస్తకాలిప్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.