"వైతరణి నది ముందు కొన్ని కోట్ల ఆత్మలు ఇద్దరి ఆటోగ్రాఫ్ లకోసం యుధ్ధాన్ని మొదలలెడుతాయి":నిన్న అతిలోక సుందరి శ్రీదేవి, నేడు జగదేకవీరుడు స్టీఫెన్ హాకింగ్, రేపు నువ్వు , ఆ తరువాత నేను, అయినా ఈ మానవ జీవన ప్రవాహానికి ఏదైనా అడ్డొస్తుందా? నిత్యం నన్ను తొలిచే ప్రశ్న?అది నిరంతరంగా సాగుతుంది.విధి కి ఒకటే లక్ష్యం నిర్ణతరం ఈ ఆత్మల్ని సాగనంపడం.మనిషి పుట్టుక నుంచి ఈ తంతు సాగుతోంది,నన్ను ఈ రెండు మరణాలు కలిచి వేశాయి ఒకరేమో తన అందంతో ప్రపంచాన్ని ఆకర్శిస్తే, ఇంకొకరు తను జీవచ్ఛ్వామలా బ్రతుకుతూ ఒక కంప్యూటర్ సహాయంతో విశ్వమానవ కల్యాణికి తోడ్పడిన ఒక తేజోమూర్తి.నిన్న రాత్రి స్టీఫెన్ హాకింగ్ మరణ వార్థ విన్న తరువాత నాకేమి గుర్తుకు రాలేదు.
నా మెదడు కొన్ని క్షణాలు మాంసం ముద్దలా మారిపోయింది.రేపు మనందరం కూడా బూడిదలాగా మారిపోవాల్సిందే , ఇన్నాళ్లు మనం చదివిన చదువు మనము ప్రేమించిన సినిమా అన్ని మన బ్రెయిన్ చచ్చిపోవడంతో నామరూపాలు లేకుండా పోవాల్సిందే.మన చావులకి మనం ఇంత బాధపడుతుంటే ఒక అందాల తార శ్రీదేవి , ఒక విశ్వ రహస్యాలను ఛేదించి ఆత్మవిశ్వాసమే నీ అంతిమ పోరాటాం అని చాటి చెప్పిన దీశాలి ఇలా..
ఎందరో?వాళ్ళ మరణం నాకేకాదు ప్రపంచ పతి నాగరీకుడ్ని వేదన కలిగిస్తుంది.ప్రతిఒక్కడికి మరణం సంభవిస్తుంది ఆరోజు వాళ్ళందరూ ప్రవహించే వైతరని నది ముందు కూర్చున్నప్పుడు ఇద్దరి ఆటోగ్రాఫ్లకి కొన్ని కోట్ల ఆత్మలు పరితపిస్తాయి ఒకరు అందాల తార శ్రీదేవి, మరొకరు నిత్య చైతన్యశీలి స్టీఫెన్ హాకింగ్.
-- సూర్య ప్రకాష్ , సినీ విశ్లేషకులు