దద్దరిల్లిన షాద్ నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్
షాద్ నగర్
వద్దురా నాయనా కెసిఆర్ పాలన అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసి బస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఆర్టిసి కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచాయి. తెలంగాణ బంద్ సందర్భంగా కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సిపిఐ, టీజేఏసీ, టిడిపి తదితర ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నర్సిహులు ఆధ్వర్యంలో కార్మికులు పాల్గొనగా కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్, టీపీసీసీ నేత బాబర్ ఖాన్, బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి, సిపిఎం నేత రాజు, సిపిఐ నేత శ్రీను నాయక్, కార్మిక సంక్షేమ సంఘం నేత పినపాక ప్రభాకర్, టీజేఏసీ నాయకురాలు అనురాధ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ ఎఫ్, టివివి, ఎస్ ఎఫ్ ఐ, బిజెవైఎం, ఏఐఎస్ ఎఫ్, ఎబివిపి, యూటీఎఫ్, పౌరహక్కుల సంఘం, బీజేఎంఎం తదితర సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఉదయం ఐదున్నర గంటలకే డిపోకు చేరుకుని గేటు ముందు బైఠాయించారు. ఉదయం ఎనిమిదిన్నర తరువాత షాద్ నగర్ ఏసీపీ వి. సురేందర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శ్రీదర్ కుమార్ తదితర సిబ్బంది పెద్దఎత్తున ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీదర్ కుమార్ ఆందోళన కారులను ఆందోళన విరమించుకోవాలని కోరారు. డిపోకు అడ్డంగా కూర్చోకుండా ఇట్టి స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆందోళన కారులు వినక పోవడంతో పోలీసులు రంగంలోకిదిగి అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ జులుం నశించాలి, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు సుధీర్, బాలరాజ్ గౌడ్, బాదేపల్లి సిద్ధార్థ, మాధవ్, నాగమణి, సిపిఎం నాయకులు రాజు, ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, సిపిఐ నాయకులు శీను నాయక్, ఆర్టీసీ నేతలు ఎస్ పి రెడ్డి, వెంకటయ్య, నర్సింలు, ఎస్ ఎస్ రెడ్డి, నజీర్, తిరుపతయ్య, రిషి కుమారి, రాధిక, జ్యోతి,లావణ్య, సౌభాగ్య లక్ష్మి, బిజెపి నాయకులు దేశ్ ముఖ్, వంశీకృష్ణ, ప్రముఖ రచయిత వంగూరి గంగిరెడ్డి, తిరుమలయ్య, టివివి ప్రవీణ్, తెలుగుదేశం నాయకులు మీరాపురం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.