YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీకి పట్టం కడుతున్నారు

బీజేపీకి పట్టం కడుతున్నారు

బీజేపీకి పట్టం కడుతున్నారు
విజయవాడ 
మహారాష్ట్ర,హర్యానాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నాను. గతంలో ఎన్నికలంటే ఈ సారి ప్రజల్లో ఆసక్తి ఉంది. బీజేపీ చేస్తున్న అభివృద్ధి ని చూసి ప్రజలు బీజేపీ కి అన్ని ఎన్నికల్లో పట్టంకడుతున్నారని ఆ పార్టీ ఎంపి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం అయన మీడియాతోమాట్లాడారు. గతంలో మహారాష్ట్ర కాంగ్రెస్, యన్ సి పి కి కంచుకోట. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజలకు దగ్గర కావాలనేదే బీజేపీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం బీజేపీ కి సులువు కాదు. ప్రజలు మార్పు కోరుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో తాను ఉన్నా ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటానని అయన అన్నారు. మేము చంద్రబాబును సీఎంగా చేశాం.  కులాలు,మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారు. - చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. - కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.రాబోయే పార్లమెంట్ సమావేశాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాను.  30లక్షల పంప్ సెట్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది. రాష్ట్రానికి ఎక్కువ పంప్ సెట్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ 5 శాతం తగ్గించింది. దీనివలన దేశంలో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఆర్టికల్ 370 ఎత్తివేస్తారని ఎవరూ ఊహించలేదు. అంతర్జాతీయ సమస్య గా చిత్రీకరించాలని అనేక దేశాలు ప్రయత్నం చేసాయని జీవీఎల్ అన్నారు. 

Related Posts