Highlights
- ఎదుర్కోలేనప్పుడు లొంగిపోవాలి
- నిర్బయ తల్లి శారీరక ఆకృతి చక్కగా ఉంది
- ఆమె కుమార్తె ఎంత అందంగా ఉందో..?
- నోరు జారిన మాజీ డీజీపీ సంగ్లియానా
ఓ నిర్భయ కేసు విషయంలో కర్ణాటక మాజీ డీజీపీ సంగ్లియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు.
ఢిల్లీలో 16 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై బాధిత కుటుంబం రాజీలేని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి ఆశాదేవి న్యాయస్థానాల్లో పట్టువీడని విక్రమార్క తరహాలో పోరాటం చేశారు. ఆమెతో పాటు మరికొందరి సేవలను గుర్తిస్తూ బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హజైన సంగ్లియానా నోరు పారేసుకున్నారు. నిర్బయ తల్లి ఆశాదేవి చక్కని శారీరక ఆకృతితో ఉన్నారంటూ సంగ్లియానా నోరు జారారు. ఆమె కుమార్తె ఎంత అందంగా ఉండేదో తానిప్పుడు ఊహించుకుంటున్నానన్నారు. అలాగే, అత్యాచారాలపై మాట్లాడుతూ... ‘‘మీరు పోరాడ లేకుంటే సరెండర్ అయిపోవాలి. తర్వాత కేసు వేసుకోవాాలి. ఆ విధంగానే మనం సురక్షితంగా బయటపడగలం, ప్రాణాలను కాపాడుకోగలం’’ అని సంగ్లియానా ఉచిత సలహా పారేశారు. దీనితో కార్యక్రమానికి హాజరైన వారంతా అవ్వాకయ్యాడు.