పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరం - ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు
పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరు పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, డిఎస్పి రామకృష్ణ లు అతిథిలుగా హాజరై ప్రారంభించారు.అనంతరం వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మందులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ నిత్యం కష్టపడి పనిచేస్తూ సమాజాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నక్సల్స్ దాడుల్లో అనేక మంది పోలీసులు అమరుల య్యారన్నారు.పోలీసుల సంక్షేమ కోసం తొలిసారిగా వారాంతరపు సెలవును మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్_జగన్ కే దక్కుతుందన్నారు.కార్యక్రమంలో వైసిపి నాయకుడు రుద్రగౌడ్, పట్టణ రూరల్ సిఐ లు వి.శ్రీధర్, మహేశ్వరరెడ్డి, మంత్రాలయం సిఐ క్రిష్ణయ్య, పట్టణ ఎస్ఐ లు శ్రీనివాసులు, శరత్ కుమార్, రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య, డాక్టర్ లు బాలయ్య, గంగాధర్, మాలకొండయ్య, నవీన్ కుమార్ గౌడ్, గడిగే శిల్ప, ఎంఇఓ వినోద్ కుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పక్కీర్ సాహెబ్, సతీష్, సభ్యులు నాగరాజు, చంద్రమోహన్, రమేష్, ప్రభాకర్, ధర్మకారినాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.