YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇళ్ల స్థలాల విషయంలో అలసత్వం వద్దు

ఇళ్ల స్థలాల విషయంలో అలసత్వం వద్దు

ఇళ్ల స్థలాల విషయంలో అలసత్వం వద్దు
ఏలూరు,
పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయడంలో అర్హులైన ఏఒక్క లబ్దిదారునికి అన్యాయం జరుగకుండా జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్  రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం సబ్ కలెక్టర్ ,ఆర్ డిఒలు, మున్సిపల్ కమీషనర్లు, తాహసిల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పేదలకు ఇళ్లస్దలాలు, గృహనిర్మాణం, వాహనమిత్ర తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో 80 వేల మంది స్థలాలు వుండి గృహాలు లేని లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. 1.41 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లస్థలాలు అందించాల్సి వుంటుందని చెప్పారు.అర్హులు ఎంతమంది వున్నదీ తేల్చేందుకు ఈనెల 20వ తేది వరకు గ్రామసభలు నిర్వహించి జాబితాలోని వారిపై అభ్యంతరాలు వున్నా పరిశీలించడం , ఇంకా అర్హతవున్నవారినుండి ధరఖాస్తులు స్వీకరించి వాటినికూడా పరిశీలించి జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ధరఖాస్తుల పరిశీలనలోగాని, జాబితా రూపొందించడంలోగాని అర్హులను అనర్హులుగా ప్రకటిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చించారు. పొరపాటుగాని, నిర్లక్ష్యంగా గాని అర్హతగల ఏఒక్క లబ్దిదారునికి అన్యాయం జరగడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమితో పాటు 10 శాతం అధనంగా సేకరించాలన్నారు. భవిష్యత్ లో ధరఖాస్తు చేసుకునే అర్హతగల లబ్దిదారులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా 10 శాతం భూమిని అధనంగా సేకరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పధకంపై కలెక్టర్ సమీక్షిస్తూ చిన్నచిన్న కారణాలతో ధరఖాస్తులు తిరస్కరించిన వారికి కూడా సాయం అందించాలనే వుద్దేశ్యంతో కొన్ని నిబంధనలు సడలించి ఈనెల 31వ తేదీ వరకు ధరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగించడం జరిగిందని ఈవిషయంపై ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఇంకా సాయం పొందని డ్రైవర్లతో ధరఖాస్తులు చేయించి అర్హతగల ప్రతి డ్రైవరు లబ్దిపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్  ఎం వేణుగోపాల్ రెడ్ది , జాయింట్ కలెక్టర్ .2  నంబూరి తేజ్ భరత్, గృహనిర్మాణశాఖ పిడి  ఎం రామచంద్రారెడ్ది, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Posts