YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో 31773 ఫిర్యాదులు వచ్చాయి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ 

రాష్ట్రంలో 31773 ఫిర్యాదులు వచ్చాయి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ 

రాష్ట్రంలో 31773 ఫిర్యాదులు వచ్చాయి
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ 
అమరావతి 
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినాన్ని అక్టోబర్ 21 న జరపుకుంటున్నాం. అమరలైన పోలీసుల త్యాగాలు మరువలేనివి. ఈ వారం మొత్తం పోలీసుల సేవలు తెలియపరిచేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అయన పలు విషయాలు వెల్లడించారు. 2511 పాఠశాలలు, కళాశాలల నుండి వచ్చిన 1,81,315 మంది విద్యార్దులు ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. రహదారి భద్రతల, సీటిజన్ సెంటర్ సర్వీస్, డ్రోన్స్, టెక్నాలజీ పోలిసింగ్, డయల్ 100 , క్లూస్ టీమ్స్, ఆయుదాలు వంటి వాటి గురించి తెలియజేశాం. పోలీసుఅమరవిరుల స్మరణదినం సందర్బంగా 10513 మంది పోలీసులు, ప్రజలు రక్తదానం చేశారు. పోలీసుశాఖలో వీక్లీ ఆఫ్ ల సుమారు 62000 కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయని అన్నారు. పోలీసుల వీక్లీ ఆఫ్ యాప్ ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం.. పోలీసు కుటుంబాల ఆరోగ్యం కోసం ఆరోగ్యభద్రత స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. పోలీసులు విది నిర్వహణలో మరణిస్తే దాదాపు 40 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తం ఏపీలోనే అందిస్తున్నాం. హోంగార్డ్స్ కు రోజు వేతనంహోం గార్డు లకు 600 నుండి 710 వరుకు పెంచామని అన్నారు. 15000 హోంగార్డులకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ సంక్షెమ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. అనేక కేసులు పరిష్కారం అవుతున్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా 31773 ఫీర్యాదు వచ్చాయి. 7442 కేసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశాం.  23677 కేసులు పరిష్కారించ గలిగాం. 654 కేసులు పెండింగ్లో ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.

Related Posts