YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టామాటో అమ్మాకాలపై ముఖ్యమంత్రి ఆరా

టామాటో అమ్మాకాలపై ముఖ్యమంత్రి ఆరా

టామాటో అమ్మాకాలపై ముఖ్యమంత్రి ఆరా
అమరావతి 
కర్నూలు జిల్లా పత్తికొండలో టొమాటో కొనుగోళ్లలో సమస్యలు,  ధరల పతనంపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ఆరా తీసారు.టమోటా కొనుగోలులో తలెత్తిన సమస్యలపై సమాచారం కోరినట్లు సమాచారం. పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దానివల్ల మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమిషన్ ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చని  అధికారులు వివరించారు. డీ రెగ్యులేట్ చేయడంపై టమోటా కొనుగోలు నిలిపేశారన్న అధికారులు,పత్తికొండ మార్కెట్లో కాకుండా మార్కెట్ బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులను ఇబ్బందులకు గురిచేశారని సీఎంకు వివరించారు. మార్కెట్లోనే తాము టామోటాను అమ్ముతామని రైతులు స్పష్టంచేశారని వెల్లడించారు. ఏదిఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశించారు. మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి,  వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని అన్నారు. సీఎం ఆదేశాలతో పత్తికొండ మార్కెట్యార్డులో తిరిగి టమోటా కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామన్న అధికారులు, ఉదయం నుంచి 50 టన్నుల టమోటాను కొనుగోలుచేశారని వివరించారు. మార్కెటింగ్శాఖ అధికారులు ధరలు తగ్గకుండా వేలంపాటలో పాల్గొంటున్నారు. ఐదు టన్నుల వరకూ కొనుగోలుచేసారు. ధరలస్థిరీకరణ నిధి కింద ఈ కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు వ్యాపారులు కూడా వచ్చి టమోటాను కొనుగోలుచేస్తున్నారని మార్కెటింగ్శాఖ కమిషనర్ ప్రద్యుమ్న  వెల్లడించారు. 

Related Posts