YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పత్రికా స్వేచ్ఛపై మట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు

పత్రికా స్వేచ్ఛపై మట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు

పత్రికా స్వేచ్ఛపై మట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబా మాట్లాడేది? కేసులపై జీఓలే ఇచ్చారు
-  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం 
 ఏపీలో వైయస్ఆర్సీపీ 4 నెలల పాలనపై ప్రతిపక్షమైన టీడీపీ, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న మీడియా తాబేదార్లు, సహచరులు కొంతమంది పత్రికా స్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతుండటంపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ముందు ఈ విషయంలో చంద్రబాబుకు మాట్లాడే నైతిక హక్కు లేదని ధర్మాన మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లు చంద్రబాబు పరిపాలన చూశామన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చట్టాల్ని మోసగించి .. కోర్టులకు దొరకకుండా ఎత్తుగడులతో నైతికతలేని ప్రజాధనాన్ని అన్నివిధాలుగా చంద్రబాబు దోపిడీ చేశారని ధర్మాన అన్నారు. చంద్రబాబు తన తాబేదార్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. చంద్రబాబుకు అనుకూలమైన సంస్థలు అన్నింటికీ ప్రజాధనం దోచిపెట్టారన్నది బహిరంగ రహస్యమని ధర్మాన మండిపడ్డారు. మీడియాను అడ్డంపెట్టుకొని చాలా మందితో చంద్రబాబు ఆడుకున్నారు. రాజకీయంగా పతనం అయ్యేలా చంద్రబాబే వ్యవహరించారు. బాబు పాలన అద్భుతం అని మీడియా రాసినా ప్రజలు తిరస్కరించారు.  చంద్రబాబు ఎప్పుడూ తనకు అనుకూలంగా ఉండే పత్రికలను అడ్డంపెట్టుకొని అనేక మంది జీవితాలతో ఆడుకొన్నారు. గత ఐదేళ్లలో కొంతమందిని రాజకీయంగా పతనం చేసే పని కూడా చేశారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాజకీయ పార్టీలను కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బలవంతులు, విజ్ఞులు కాబట్టే కొన్ని దొంగ వార్తలు రాయటం వల్ల ప్రజాభిప్రాయం మార్చలేమని ఈ ఎన్నికల్లో రుజువైందన్నారు. పాలనపై చంద్రబాబు జోస్యం చెప్పటం ఏంటి ? చంద్రబాబు పాలనను ఎదుటివారిపై రుద్దటం ఏంటి?  ప్రజాస్వామ్యంపై చంద్రబాబు మాట్లాడటమా?  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి చంద్రబాబుకు తెల్సు. అయితే... వచ్చే నాలుగేళ్ల పరిపాలనను చంద్రబాబు ఇప్పుడే చెప్పేయటం ఏంటని ధర్మాన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ధర్మాన నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుపోయిందని, బీహార్లా రాష్ట్రం తయారైందని, గూండాయిజం కొనసాగుతోందని చంద్రబాబు మాట్లాడటంపై ధర్మాన మండిపడ్డారు. 

Related Posts