YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

మున్సిపాలిటీలలో పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు -  జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి

మున్సిపాలిటీలలో పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు -  జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి

మున్సిపాలిటీలలో పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు
-  జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి 
పరిశుభ్రత విషయంలో మున్సిపాలిటీలలో సైతం మార్పు తీసుకు వచ్చేందుకు గ్రామ పంచాయతీలలో చేపట్టిన విధంగానే ఈనెల 19 నుండి పదిహేను రోజుల పాటు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.
శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డుల ప్రత్యేక అధికారులతో సమావేశమై చర్చించారు.       మున్సిపాలిటీలలో చేపట్టే పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఖాళీ స్థలాల పరిశుభ్రత, మురికి కాలువ పరిశుభ్రత, అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చడం, హరితహారం కింద మొక్కలు నాటడం, వంగిన విద్యుత్ స్తంభాలను, వేలాడుతున్న వైర్లను గుర్తించటం, వీధిలైట్లు లేని ప్రాంతాలను గుర్తించడం, ప్లాస్టిక్ నిషేధంపై, ఇంటి ఎరువు తయారీపై అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నుండి మూడవ రోజు వరకు వార్డులలో వార్డు సభ నిర్వహించాలి, ముందుగా వార్డు సభ నిర్వహించే స్థలాన్ని గుర్తించి మెప్మా, ఉపాధి హామీ కూలీలు, వార్డులోని పెద్దలతో వార్డు సభ నిర్వహించాలని కలెక్టర్ ఈ కార్యక్రమాలలో మున్సిపల్ సిబ్బంది  చురుకుగా, పూర్తి అప్రమత్తతతో పాల్గొనాలి. కనీసం 115 మందితో వార్డు సభ నిర్వహించాలి, సభకు హాజరైన ప్రముఖులతోపాటు పూర్తి వివరాలతో, ఫోటో తో సహా నివేదిక సమర్పించాలి. వార్డు సభను పకడ్బందీగా చేపట్టాలి. ఒక రిజిస్టర్ ని ఏర్పాటు చేసి రిజిస్టర్ లో ఎంతమంది పాల్గొన్నది నమోదు చేయాలి. పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక పై ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్  ను ఏర్పాటు చేయాలి. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పరిశుభ్రతకు అడ్డంకిగా ఉండే   పాడుబడిన ఇళ్లను తొలగించాలి. అలాగే ఇంజనీర్ల ధ్రువ పత్రం ఆధారంగా పాడుబడిన ప్రభుత్వ భవనాలు కూడా తొలగించాలి. పిచ్చి మొక్కలను తొలగించాలి, ముందుగా వారికి నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో ఎలాంటి స్పందన రానట్లయితే మున్సిపాలిటీ ద్వారా తొలగించి జరిమానా విధించాలి. కాళీ స్థలాలకు ఎవరు బాధ్యత వహించని పక్షంలో అలాంటి స్థలాలను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవాలి. అలాగే పాడుపడిన ఇండ్ల తొలగింపు విషయంలో కూడా నోటీసులు జారీ చేసి తొలగించాలి.  అంతర్గత రహదారులపై ఏర్పడిన ఉత్తరం పూడ్చేందుకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గుంతలు గుర్తించిన వెంటనే మొరం తో పాటు, దుమ్ము వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాలకు కంచె ఏర్పాటు చేయడం లేదా అటువైపుగా ఎవరు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం చేయాలని, ప్రత్యేకాధికారి తీర్మానం తర్వాతనే వీటిని చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Related Posts