YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

టీమిండియాను ఆదుకున్న రోహిత్ శర్మ, రహానెలు 

టీమిండియాను ఆదుకున్న రోహిత్ శర్మ, రహానెలు 

టీమిండియాను ఆదుకున్న రోహిత్ శర్మ, రహానెలు 
రాంచీ, 
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం ఆరంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 58 ఓవర్లు ముగిసే సమయానికి 224/3తో నిలిచిన దశలో వెలుతురులేమి కారణంగా ఆటని తొలుత అంపైర్లు నిలిపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వర్షం రావడంతో ఈరోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (117 బ్యాటింగ్: 164 బంతుల్లో 14x4, 4x6), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (83 బ్యాటింగ్: 135 బంతుల్లో 11x4, 1x6) ఉండగా.. ఈరోజు సఫారీ బౌలర్లలో రబాడ రెండు, నోర్తేజ్ ఒక వికెట్ తీశాడు.మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (10: 19 బంతుల్లో 2x4) ఇన్నింగ్స్ 5 ఓవర్‌లోనే రబాడ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (0: 9 బంతుల్లో) కూడా జట్టు స్కోరు 16 వద్ద రబాడ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (12: 22 బంతుల్లో 2x4)‌ని ఆన్రిచ్ నోర్తేజ్ ఔట్ చేశాడు. దీంతో.. తొలి సెషన్ ఆరంభంలోనే భారత్ జట్టు 39/3తో ఒత్తిడిలో పడింది.తొలి సెషన్‌లో 16 ఓవర్లు ముగిసే సమయానికి మూడు ప్రధాన వికెట్లు చేజారిన నేపథ్యంలో.. అజింక్య రహానెతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతని తీసుకున్న రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని రెండో సెషన్ వరకూ ఆచితూచి ఆడారు. కానీ.. మూడో సెషన్‌లో గేర్ మార్చిన రోహిత్ శర్మ.. వరుస సిక్సర్లతో సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా చూపకుండా భారీ షాట్లు ఆడిన రోహిత్ 130 బంతుల్లోనే తాజా సిరీస్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కి రహానెతో కలిసి 256 బంతుల్లోనే 185 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ.. భారత్ జట్టుని తొలిరోజు మెరుగైన స్థితిలో నిలిపాడు
 

Related Posts