Highlights
- శుక్రవారం టీడీపీ అత్యవసర భేటీ
కేంద్రంలో అధికారంలో ఉన్నఎన్డీయేకు భాగస్వామ్య పార్టీ తెలుగు దేశం పార్టీ తన సంబంధాలను తెగదెంపులు చేసుకునేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకు టిడిపి ఈ నిర్ణయానికి వాచినట్టు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసించిన టీడీపీ కేంద్రంలో మంత్రి పదవులను వదులుకున్న సంగతి తెలిసిందే.
టీడీపీ పొలిట్బ్యూరో శుక్రవారం అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్డీయే నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.తమకు వ్యతిరేకంగా అనేక శక్తులను ప్రొత్సహించడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో మహాకుట్ర జరుగుతోందని, ఈ కుట్రలో భాగంగానే నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేశారు. ఇదే అంశంపై చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పవన్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో...బీజేపీ తమకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, అటువంటప్పుడు కేంద్రంలోని సంకీర్ణంలో ఉండాల్సిన అవసరం ఏంటని టీడీపీలో కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు.