YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన బంద్

ప్రశాంతంగా ముగిసిన బంద్

ప్రశాంతంగా ముగిసిన బంద్
హైద్రాబాద్, 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె 15వ రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. శనివారం ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.బంద్‌ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్ నల్గొండ జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌, రాణిగంజ్‌, కంటోన్మెంట్‌ల్లోనూ బస్సులను డిపోల నుంచి కదలనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.బంద్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.కార్మికుల మద్దతు తెలపడానికి వెళ్లిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సహా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, పటాన్‌చెరులోని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి గోదావరి అంజిరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు.ఎంజీబీఎస్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేత హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు.బస్‌భవన్‌ వద్దకు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు తరలి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సుభవన్‌ లోపలికి ఇతరులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.బస్‌భవన్ మార్గంలో సీసీ కెమెరాలతో నిఘా పటిష్ఠం చేసిన పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్‌, మధుయాష్కీ గౌడ్ , కూన శ్రీశైలం గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌ రెడ్డి నివాసాల ముందు భారీగా పోలీసులను మోహరించారు.నిజామాబాద్ జిల్లాలో బస్సులపై రెండు చోట్ల ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అచన్‌పల్లి, ముజారక్ నగర్‌లో రాళ్లు రువ్వడంతో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.ఇందిరా పార్క్ నుంచి బస్‌భవన్‌కు టీజేఎస్ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో బస్సు నడుపుతోన్న తాత్కాలిక డ్రైవర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.బండ్లగూడ డిపో వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకుంది. బస్సుల్లో గాలితీసి డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు పగులగొట్టారు.సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి సహ పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.సంగారెడ్డిలో బస్సులు డిపోలకే పరిమితం కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరయ్యేందుకు ముందుకు రాలేదు.డిపోవద్ద నిరసన తెలియజేయడానికి వచ్చిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్యతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.షాద్‌నగర్ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. బంద్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన పలు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిరసన తెలుపుతోన్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావుకు గాయమైంది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య చెయ్యి ఉండిపోవడంతో బొటనవేలు తెగిపడింది.పోలీసులు ఉద్దేశపూర్వకంగానే డోర్ మధ్య పెట్టి నొక్కి కట్ చేశారని ఆయన ఆరోపించారు.నన్ను కేసీఆర్ చంపమన్నాడా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు ఇది నాకు బహుమనమా? అని పోటు రంగారావును పోలీసులను నిలదీశారు.ఉస్మానియా నుంచి బయటకు వచ్చేందకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది.ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటువద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు చేపట్టాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశాయి.సమ్మెకు సచివాలయ ఉద్యోగులు సంఘీభావం.. భోజన విరామ సమయంలో నిరసన తెలిపిన ఉద్యోగులు.

Related Posts