బన్నీ ఖాతాలో మరో రికార్డ్
హైద్రాబాద్,
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా `అల వైకుంఠపురంలో`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని తొలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన సామజవరగమన పాట యూట్యూబ్‌లో రికార్డ్‌లు సృష్టిస్తోంది. తమన్ సంగీతమందించిన ఈ సినిమా పాటకు లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రీ సాహిత్యమందించారు.లేటెస్ట్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. గతంలో ఏ తెలుగు పాటకు రాని విధంగా భారీగా లైక్స్, వ్యూస్ సాధించటంపై చిత్రయూనిట్ హర్ష వ్యక్తం చేస్తున్నారు.సామజవరగమన పాట విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. ఓ తెలుగు పాటు ఇన్ని వ్యూస్ ఇన్ని లైక్స్ రావటం ఇదే ప్రథమం.గీతాఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి టబు, మాలీవుడ్ యాక్టర్ జయరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడుప్రత్యేక తెలంగాణ నిర్బంధాల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను ఓపెన్ జైలుగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు.బంద్ సంపూర్ణంగా జరిగిందని, బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.