YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జాట్ ఓట్లే కీలకం

జాట్ ఓట్లే కీలకం

జాట్ ఓట్లే కీలకం
ఛండీఘడ్, 
హర్యానా రాష్ట్రాన్ని బీజేపీ మరోసారి గెలుచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అధికారాన్ని నిలుపుకోవడమే ధ్యేయంగా ప్రచార జోరును పెంచింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును పదే పదే ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. హర్యానాలో మొత్తం నాలుగు సభల్లో మోదీ పాల్గొంటారు. ఈసారి హర్యానాలో భారతీయ జనతా పార్టీ మిషన్ 70ని ఏడాది ముందు నుంచే ప్రారంభించింది.హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రాంతీయ పార్టీల హవా కూడా నడుస్తుంది. ముఖ్యంగా బీజేపీ రెండు అంశాలు తమను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉంది. నరేంద్ర మోదీ ఇమేజ్ తో పాటు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాలన కూడా ప్లస్ అయ్యే అవకాశముందని భావిస్తుంది. ఖట్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావడంతో మరోసారి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపిందిదాదాపు 18 ఏళ్ల పాటు నిరీక్షణ చేసిన అనంతరం 2014లో బీజేపీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. దీన్ని నిలుపుకునేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుకుంటే తమకు లాభమని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ గట్టి పట్టుంది. అయితే ఎన్నికలకు ముందు పార్టీలో జరిగిన పరిణామాలు, నేతలు వీడిపోవడం ఒకింత ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇక హర్యానాలో గెలుపును ప్రభావితం చేసే జాట్ సామాజికవర్గం ఎటువైపు నిలుస్తుందన్నదే అందరికి ఆసక్తికరంగా మారింది. జాట్ రిజర్వేషన్ల ఉద్యమం మూడేళ్ల క్రితం ఒక కుదుపు కుదిపింది. హర్యానాలో మొత్తం 29 శాతం జాట్ వర్గం ఉండటంతో అన్ని పార్టీలూ దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. జాట్ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతంలో ప్రచారాన్ని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ గెలుపు అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts