YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొనుగోళ్లకు సిద్ధమౌతున్న సివిల్ సప్లయిస్ 

కొనుగోళ్లకు సిద్ధమౌతున్న సివిల్ సప్లయిస్ 

కొనుగోళ్లకు సిద్ధమౌతున్న సివిల్ సప్లయిస్ 
ఖమ్మం,
 వరి కోతలు షురూ అయ్యాయి.  నూర్పిడి చేసిన ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ సన్నద్ధమైంది. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించేందుకు ఆయా శాఖలు సిద్ధమయ్యాయి. కొనుగోళ్లకు అవసరమయ్యే సదుపాయాలను పౌర సరఫరాల సంస్థ సమకూరుస్తోంది. ఇప్పటికే మార్కెటింగ్‌, పౌర సరఫరాల సంస్థ, శాఖ, రవాణా, తూనికలు, కొలతలు, సహకార, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల అధికారులు సమావేశమై ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ రూపొందించారు. 31 లక్షల గన్నీ సంచులు అవసరమని గుర్తించగా ఇప్పటికే 16 లక్షల సంచులు ఉండగా, మిగిలిన 15 లక్షల సంచులను కోల్‌కతా నుంచి తెప్పిస్తున్నారు. కేంద్రాలు ప్రారంభమై ధాన్యం తరలించే నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. 189 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని 112 రైసుమిల్లులకు తరలించనున్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం రవాణాకు ఇద్దరు ట్రాన్స్‌పోర్టర్లను నియమించారు. ధాన్యం తూర్పారపట్టే యంత్రాలు, టార్పాలిన్లు, కాంటాలు, తేమ కొలిచే యంత్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో సాగుచేసిన వరి సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక రూపొందించింది. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు గన్నీ బస్తాల కొరత తలెత్తకుండా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించేందుకు వీలుగా ముందస్తుగా తగిన రవాణా ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో వరి సాధారణ  సాగువిస్తీర్ణం 38,000 హెక్టార్లు ఉండగా 28,000 హెక్టార్లతో సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తి విస్తీర్ణంలో పంట సాగు చేయలేదు. దాదాపు యాభైశాతం వరకు ఘనపూర్‌ ఆనకట్ట, మంజీరా పరీవాహర ప్రాంతంలో, మిగతాది బోర్ల కింద సాగైంది. సరైన వర్షాలు కురవక చెరువులు నిండకపోవడంతో వాటి కింద సాగు అంతంతమాత్రంగానే ఉంది. లోటు వర్షపాతం, ఘనపూర్‌ ప్రాజెక్టు పరిధిలో సాగు చేసిన పంటకు నీటితడులు అందడంలో కాస్త ఆలస్యం కావడంతో చాలా చోట్ల వరి పంట ఎండిపోయింది. దీంతో దిగుబడులు చాలా వరకు తగ్గనున్నాయి. నిరుడు వానాకాలంలో సాగు చేసిన పంట ద్వారా 1.56 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఈ ఏడాది అంతకన్నా తక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థ గణాంక శాఖ అంచనాలు రూపొందించింది. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల్లో ఈసారి 1.25 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 గా మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ జిల్లాలో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 121, ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) మహిళా సంఘాల ఆధ్వర్యంలో 68 ధాన్యం  కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఈసారి మద్దతు ధర పెంచడంతో రైతులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1,770, బీ-గ్రేడ్‌ రకానికి రూ.1,750గా నిర్ణయించింది. నిరుటితో పోల్చుకుంటే ఏ-గ్రేడ్‌కు రూ.180, బీ-గ్రేడ్‌కు రూ.200 చొప్పున పెంచింది.  నాణ్యత ప్రమాణాల మేరకు ఈ ధరను చెల్లించనున్నారు. రైతులు నిర్దేశించిన తేమ, తాలు శాతం పాటించి మద్దతు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts