ఘనంగా అమర వీరుల దినోత్సవం
జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా, జిల్లా కేంద్రంలోని సాయిగా రిజర్వు పోలీసు కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు జిల్లా పోలీస్ అధికారులు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు ఎస్పీ కృష్ణకు సాయుధ రిజర్వు పోలీసు అధికారులు స్వాగతం పలికారు వారితో గౌరవ వందనం స్వీకరించారు అదనపు ఎస్పీ. అనంతరం పోలీస్ అమరవీరుల స్తూపం కు నివాళులు అర్పించారు. పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించినవారిలో అదనపు ఎస్పీ కృష్ణ గద్వాల అల్లంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఉన్నారు. అలాగే పోలీస్ అధికారులు కూడా అమరవీరుల స్థూపం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించిన సందర్భంలో మొదటి రెండవ మూడవ బహుమతి లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు అదనపు ఎస్.పి గద్వాల అల్లంపూర్ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్. 29 రాష్ట్రాలలో సుమారు 292 మంది పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తన ప్రాణాలు అర్పించారు అని వారికి జోహార్లు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పోలీసులు విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గా దేశ సరిహద్దుల్లో ఉంటూ మన దేశాన్ని కాపాడుతున్న గొప్ప సైనికులని రక్షణ దళాలు ఎప్పుడు అండగా ఉంటానని మనము ఈ రోజు హాయిగా జీవిస్తున్నాం అంటే ప్రధాన కారణం రక్షణ సిబ్బందిని పోలీసులు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే ముఖ్యం ప్రజలకు ఎప్పుడు రక్షణ గా ఉంటూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించారు.