YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బ్లాక్‌ చైన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా ఏపీ -మంత్రి నారా లోకేశ్‌

బ్లాక్‌ చైన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా ఏపీ -మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ ను బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌ చైన్‌ టెక్నలజీ అభివృద్దికి లోకేశ్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ, కోవలెంట్ ఫండ్ మధ్య ఈ రోజు ఒప్పందం కుదిరింది.  కోవలెంట్ ఫండ్ ప్రతినిధులను లోకేశ్‌ సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు తీసుకొని వెళ్లి రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించారు.  విశాఖపట్నం లో బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, బ్లాక్ చైన్ టెక్నాలజీ లో రాష్ట్ర యువతి యువకులు ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామన్నారు. స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ చైన్ టార్గెట్ 2019 లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు కోవలెంట్ ఫండ్ తో ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. 2019 లోపు 5000 మంది విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర యువతి యువకులకు కోవలెంట్ ఫండ్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా చెయ్యడమే ఈ ఒప్పందం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వివరించారు. 
రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామని సమస్యలు అధిగమించి, ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి రాష్ట్రంలో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ ఒకే చోట సమాచారం అంతా ఉండేలా ఈ ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ రూపొందించినట్లు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 149 రూపాయిలకే టెలివిజన్, వైఫై, టెలిఫోన్ సేవలు అందిస్తున్నాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని దీని వలన సైబర్ ఎటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉందని అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సమాచారానికి రక్షణ కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. సర్టిఫికెట్లు కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ లాకర్ , ఆధార్ నెంబర్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఆన్ లైన్ లో ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు.

Related Posts