దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి వరుసగా మూడో రోజూకూడా నష్టాలతోనే ముగిశాయి. గురువారం ఆరంభం నుంచి బలహీనంగానే ఉన్నప్పటికీ మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు మరింత డీలాపడ్డాయి. సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 33,685 వద్ద, నిఫ్టీ 51పాయింట్ల నష్టంతో 10,360 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ భారీగా నష్టపోయింది.ఐవోసీ, ఎస్‌బ్యాంక్, రిలయన్స్, గెయిల్, ఐసీఐసీఐబ్యాంక్ టాప్‌లూజర్స్ గా నిలిచాయి.