రేవంత్ రెడ్డి అరెస్ట్
హైద్రాబాద్,
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడిస్తారనే సమాచారంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఎవరికీ కనిపించలేదు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం ఆయన సన్నిహితుల ఇళ్ల వద్ద, ప్రగతి భవన్ సమీపంలోని హోటళ్లలో పోలీసులు వెతికారు. ఇంట్లో నుంచి అనూహ్యంగా బయటకు వచ్చిన రేవంత్.. అప్పటికే సిద్దంగా ఓ కార్యకర్త స్టార్ట్ చేసి ఉంచిన బుల్లెట్‌పై ఎక్కారు. పోలీసులు అడ్డుకునే లోపే అక్కడి నుంచి ప్రగతి భవన్ చేరుకున్నారు.కొందరు కార్యకర్తలతో కలిసి ఆయన క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మెరుపువేగంతో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు రేవంత్ ప్రయత్నించారు. వెంటనే రేవంత్ రెడ్డితో పాటు ఇతరులను అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.