YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ఎవరి ధీమా వారిదే

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ఎవరి ధీమా వారిదే

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
ఎవరి ధీమా వారిదే
న్యూఢిల్లీ, 
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలోని 288 స్థానాలు, హరియాణాలోని 90 స్థానాలకూ ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో 3,237 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 235 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్నాయి. బీజేపీ 164 చోట్ల, శివసేన 124 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక విపక్ష కూటమిలో కాంగ్రెస్ 125, ఎన్సీపీ 125, మిత్రపక్షాలు 38 స్థానాల్లో బరిలో నిలిచాయి. ఇక్కడ మొత్తం 9.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.హరియాణాలోని 90 స్థానాలకు 1,169 మంది పోటీ చేస్తుండగా వీరిలో మహిళలు 104 మంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. మొత్తం 2.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర, హరియాణాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో రెండోసారి తమదే అధికారమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటడంతో ఆ పార్టీలో గెలుపుపై అత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతోన్న అతిపెద్ద ఎన్నికలు ఇవే కావడంతో అభివృద్ధి కంటే భావోద్వేగాలనే బీజేపీ ఎక్కువగా నమ్ముకోవడం విశేషం. ఆర్టికల్ 370 రద్దును ప్రధాన ప్రచారాస్త్రంగా ఆ పార్టీ వాడుకుంది. మరి ఓటర్లు ఏ మేరకు ప్రభావితమవుతారో అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.వీటితో పాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపూర్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related Posts