YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పాక్ కు షాకిచ్చిన భారత్

పాక్ కు షాకిచ్చిన భారత్

పాక్ కు షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ, 
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే బదులిచ్చింది. కుప్వారా ప్రాంతంలో పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు మరణించగా.. పొరుగు దేశానికి భారత సైన్యం దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపాలన్న దాయాది ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. ఆర్టిల్లరీ గన్‌లతో విరుచుకపడిన ఇండియన్ ఆర్మీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు ఉగ్రవాద క్యాంపులను నాశనం చేసింది. ఈ ఘటనలో 6-10 మంది పాకిస్థానీ సైనికులు ప్రాణాలు చనిపోయారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు.ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు అవకాశం కల్పించడం కోసం పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిపిందని.. ప్రతిగా సైన్యం దాడులు జరిపిందని రావత్ తెలిపారు. తంగ్ధర్ సెక్టార్‌‌కు ఎదురుగా ఉండే నీలమ్ లోయలోని మూడు లాంచ్ ప్యాడ్ల నేలమట్టం అయ్యాయని సమాచారం.ఉగ్రవాదుల చొరబాటు కోసం అవకాశం కల్పించే ఉద్దేశంతో పాక్ కాల్పులకు దిగగా.. ఈ దాడుల్లో భారత సైనికులు ఇద్దరు చనిపోయారు. ఒక పౌరుడు గాయపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పాక్ ఉద్దేశాలను అర్థం చేసుకున్న భారత్.. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. ఉగ్రవాదులకు, అక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నష్టం వాటిల్లేలా చేశామని ఆర్మీ చీఫ్ తెలిపారు. శత్రువు దాడి చేస్తే తగిన రీతిలో, అనువు చూసుకొని సమాధానం ఇచ్చే హక్కు సైన్యానికి ఉందని రావత్ చెప్పారు. దాడులను సర్జికల్ స్ట్రైక్స్ లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌తో సమానం కాదని ఆర్మీ తెలిపింది. పాక్ ఆర్మీకి గట్టి సంకేతాలు పంపిన చర్యగానే ఈ దాడులను అభివర్ణించింది. ఉగ్రవాదానికి మద్దతునిస్తే.. టార్గెట్ చేయడం తప్పదనే సంకేతాలు ఇచ్చినట్టు పేర్కొంది.

Related Posts