ఆర్టీసీ కార్మికుల సమ్మెఎఫెక్ట్..బేగంపేట మెట్రో స్టేషన్ కు తాళాలు
హైదరాబాద్
బేగంపేట మెట్రో స్టేషన్ కు అధికారులు సోమవారం ఉదయం తాళం వేశారు. భద్రతా కారణాల వల్ల స్టేషన్ ను మూసినట్లు చెప్పటంతో పాటు.. ఆ స్టాప్ లో కొంతసేపు మెట్రో రైళ్లను ఆపకుండా నిర్ణయంతీసుకున్నారు. ఎందుకిలా ? అన్నదానిపై విశ్వసనీ సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో బేగంపేట మెట్రో స్టేషన్ కు దగ్గర్లో ఉన్న ప్రగతిభవన్ ను ముట్టడించే కార్యక్రమం చేపట్టిన వేళ.. ముందుస్తు చర్యల్లో భాగంగానే స్టేషన్ కు తాళాలు వేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బేగంపేట స్టేషన్ లో రైలు ఆగటం లేదని ముందుగానే ప్రతి స్టేషన్లో నోటీసులు అంటించటం గమనార్హం.ఈ రోజు (సోమవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉండడటంతో.. గాంధీ భవన్ నుంచి మెట్రో రైలు ద్వారా బేగంపేటకు పెద్ద ఎత్తున చేరుకునేందుకు వీలుగా ప్లాన్ చేశారని.. ఆ సమాచారం అందుకొని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బేగంపేట మెట్రో స్టేషన్ కు కాసేపు తాళం వేయటంతో పాటు.. ట్రైన్లను సైతం ఆయా స్టేషన్లలో నిలపకుండా చర్యలు తీసుకున్నారు.