ఏపీ పోలీసుతో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం
విజయవాడ,
డీజీపీ కార్యాలయంలో పోలీసులకు ఇన్సూరెన్స్ పాలసీ పై యాక్సిస్ బ్యాంక్ తో పోలీస్ శాఖ ఎమ్ఓయూ కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలను డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ సుమతి, యాక్సిస్ బ్యాంక్ ఏపీ సర్కిల్ హెడ్ రామకృష్ణ మార్చుకున్నారు. డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ దేశంలోనే హోమ్ గార్డ్స్ కు భీమా సౌకర్యం కల్పించేందుకు ఆక్సిస్ బ్యాంక్ వారు ముందుకు రావడం చాలా సంతోషం. ప్రమాదంలో చనిపోయిన వారికి 40 లక్షల రూపాయల భీమా వర్తిస్తుంది. పూర్తిగా అంగవైకల్యం కలిగితే 30 లక్షల రూపాయలు భీమా వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది హోమ్ గార్డ్స్,72 వేల మంది పోలీసులు లబ్ధి పొందుతారని అన్నారు. పోలీసుల ఆరోగ్యభద్రత పథకంలో హోమ్ గార్డ్స్ భాగస్వామ్యం పై ఆలోచన చేస్తామని అయన అన్నారు.