ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం
హైదరాబాద్
పోలీస్ లను పెట్టి సీఎం కేసీఆర్ పోలీసులతో ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం చేపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ లను పెట్టి అక్రమ అరెస్ట్ లు చేపించి కార్యకర్తలను,ప్రజలను కేసీఆర్ భయబ్రాంతులకు గురిచేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపంచారు. కోర్ట్, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ సమాజం ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరినా కేసీఆర్ అహంకారం తో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఐఖ్యత ను ఉద్యమ స్ఫూర్తి ని అభినందిస్తున్నాను సమస్య పరిష్కారం అయ్యేవరకు విభజించు పాలించే టీఆరెస్ కుట్రలో పడకుండా ఐఖ్యత కొనసాగాలని కోరుకుంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుంది. ఆర్టీసీ సమ్మె 17 రోజులుగా జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది. గవర్నర్ తో ఆర్టీసీ సమ్మె పై నివేదిక తెప్పించుకున్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని అయన ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. విద్యార్థులకు సెలవులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న కేసీఆర్ పైన ఎందుకు మాట్లాడం లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీ రోల్ పోషిస్తున్న ఎంఐఎంకు ఆర్టీసీ సమస్యలు కనబడడం లేవా. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎంఐఎం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. గల్లీ లో కొట్లాట, ఢిల్లీ లో దోస్తాన బీజేపీ తో టి ఆర్ ఎస్ చేస్తుంది. కనుక కేంద్రం స్పందించదు. టిఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఫ్రెండ్లి పార్టీలేనని అయన ఆరోపించారు.