YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

"వైకుంఠ ధామం" పనులను ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ శోభ, ఎమ్మెల్యే షిండే

"వైకుంఠ ధామం" పనులను ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ శోభ, ఎమ్మెల్యే షిండే

"వైకుంఠ ధామం" పనులను ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ శోభ, ఎమ్మెల్యే షిండే
కామారెడ్డి  
కామారెడ్డి జిల్లా లోని నిజాంసాగర్ మండలం గోర్గల్  గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన వైకుంఠ దామం (స్మశాన వాటిక) పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ డి.శోభ , జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే సోమవారం  ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వైకుంఠ దామం నిర్మించాలని అందుకుగాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పది లక్షల రూపాయల నిధులు ఉపయోగించుకోవచ్చని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చినచో ఇట్టి పనికి ఉపయోగించుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వైకుంఠ దామం పనులు ప్రారంభించాలని శాసనసభ్యులు షిండే తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా100 కు పైగా గ్రామాలలో స్మశాన వాటికలు నిర్మాణ దశలో ఉన్నాయని వీటిని త్వరగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ అధికారులను ఆదేశించారు. ఒక్క నిజాంసాగర్ మండలం  లోనె 5 స్మశానవాటికలు నిర్మాణ దశలో ఉన్నాయని, గోర్గల్ గ్రామంలో ప్రారంభించిన 45 రోజులలోనే పూర్తి చేసినందుకు గాను మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి దుర్గా రెడ్డి, ఎంపీడీవో పర్బన్న, ఉపాధిహామీ పథకం మండల అధికారులను  ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిజాంసాగర్ మండల పరిషత్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే షిండే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో   మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డి. రాజు, మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి దుర్గా రెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్,  పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రావు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Related Posts