ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్ వనజా దేవి
పెద్దపల్లి ,
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి ( 50 ) వినతులు అందినట్లు తెలిపారు. పందిళ్ళ గ్రామం నుండి పోతరవేని శ్రీనివాస్ రైతు బందు మరియు కిసాన్ సమాన్ నిధి ఇప్పించుట కోరకు,ముంజంపల్లి గ్రామం నుండి భైరం మల్లయ్య పాసుపుస్తకంలో ఎంట్రి సరిచేయుట కొరకు,కనంపల్లి గ్రామం నుండి కొండ సత్తమ్మ భూమి ఇప్పించుట కొరకు,తదితర ధరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా చేసే విధంగా అవగాహన కార్యక్రామాలు నిర్వహించాలని, ప్లాస్టిక్ నిషేదానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ స్థానంలో క్లాత్ బ్యాగులను వినియోగించాలని ఆ దిశగా అవసరమైన కృషి చేయాలని అన్నారు. కలెక్టరేట్ ఎఒ రాజేశ్వర్ రావు, జడ్పీ సీఈఒ వినోద్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.