అయోడిన్ లోపం కావద్దు శాపం
జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాల అవసరం
జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్
జగిత్యాల
మనిషి దేహంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలకు చెందిన మూలకాలు అవసరమని, ఈ మూలకాలలో అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకమని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ ఆన్నారు. సోమవారం ప్రపంచ అయోడిన్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మోతే వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ హజరై ఈ ర్యాలీ ప్రారంభించారు.ఆనంతరం ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ మనిషి దేహంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలకు చెందిన మూలకాలు అవసరమని ఈ మూలకాలలో అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మపోషక మని అయోడిన్ లోపంతో అతి సాధారణంగా వచ్చే వ్యాధి థైరాయిడ్ అన్నారు. గర్భిణీలు సరైన మోతాదులో అయోడిన్ తీసుకోకపోవడం వల్ల 6 నుండి 11 సంవత్సరాల చిన్నారుల పట్ల థైరాయిడ్ శాపంగా మారిందని, సరైన మోతాదులో అయోడిన్ స్వీకరించడం వల్ల ఈ వ్యాధిని సులభంగా అరికట్టవచ్చని తెలిపారు.
ఈ లోపాలను సరిదిద్దు కోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏండ్ల క్రిందటే ఉప్పు ద్వారా దీన్ని అందించాలని అయోడైజ్డ్ ఉప్పును అందుబాటులోకి తీసుకొచ్చింది . అయినా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విడిగా బస్తాల్లో ఉండే ఉప్పుని ఉపయోగిస్తున్నారని, ఫలితంగా చిన్నారులు గర్భిణీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నదన్నారు.. ఈ క్రమంలోనే ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ప్రజల్లో ఇంకా అయోడిన్ వాడకం మరియు వాటి లాభాలు గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. థైరాయిడ్ గ్రంధి సరైన మోతాదులో హార్మోన్లను విడుదల చేయని పక్షంలో మనిషిలో దుష్పరిణామాలు ఏర్పడతాయని శరీరానికి తగిన మోతాదులో అయోడిన్ అందకపోతే హైపోథైరాయిడ్ కు దారితీస్తుందన్నారు., ఈ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు శరీర జీవక్రియలను నియంత్రిస్తాయని, అయోడిన్ లోపం వలన థైరాయిడ్ సమస్య వచ్చి థైరాయిడ్ గ్రంధి వాపు వచ్చి పెద్ద కణితిలా ఏర్పడుతుందని దీన్నే గొంతువాపు లేక గాయిటర్ అంటారని, ఈ లోపం కేవలం థైరాయిడ్ కాకుండా శరీరంలో ఇతర భాగాల పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, అయోడిన్ లోపాన్ని సరిదిద్దాలి అంటే అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని సూచించారు. అయోడిన్ ఉప్పు లను వాడితే శారీరక మానసిక సమస్యలు దూరం అవుతాయని మంచి పెరుగుదల జ్ఞాపకశక్తి చురుకుదనం ఉంటుందన్నారు.