YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువతకు చంద్రబాబు రోల్ మోడల్ 

Highlights

  • క్రికెట్ లో లాగా  ఆల్ రౌండరాయన 
  • తాత, తండ్రులకు చెడ్డ పేరు తీసుకురాను
  • అసెంబ్లీలో మంత్రి  నారా లోకేశ్:
యువతకు చంద్రబాబు రోల్ మోడల్ 

ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు యావత్తు ప్రపంచంలో నాలాంటి యువతకు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రోల్ మోడల్ అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ లో మాట్లాడుతూ..64 ఏళ్ల వయసులో కూడా 24 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తున్నారని చెప్పారు. క్రికెట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ లాగానే చంద్రబాబు కూడా అల్ రౌండర్ గా పని చేస్తున్నారని అన్నారు. తానూ మంత్రి గా బాధ్యతలు చేపట్టి కేవలం 11 నెలలు మాత్రమే అయిందన్నారు. ఈ కొద్దీ కాలంలోనే అయన పని తీరును చూసి ఆశ్చర్యపోయానన్నారు. మన కోసం, మన పిల్లల కోసం అర్ధరాత్రిళ్లు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వసతులు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలని సీఎం ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. 2003లో బాంబు పేలుడు జరిగే సమయానికి తానూ  అమెరికాలో చదువుతున్నాను. ఈ సంఘట విని ఆయనకు ఏమైందోనని కంగారుపడుతుంటే.. తిరిగి నాకే ధైర్యం చెప్పిన వ్యక్తి అన్నారు.2004లో టీడీపీ అధికారం కోల్పోయినప్పుడు కార్యకర్తలను ఎక్కడ దొరికితే అక్కడ చంపేశారు. ఆ సమయంలో కూడా కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ కార్యకర్తల కోసం స్కూల్ ఏర్పాటు చేశారు .అక్కడకు వెళ్లి పాఠాలుచెప్పిన సందర్భాలున్నాయి. ఫ్యాక్షన్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోతే వాళ్లలోని పగ పోవాలనే మోడల్ స్కూలును ఏర్పాటు చేశానని చెప్పారు. 62 సంవత్సరాల వయసులో ఎంతో నిబద్ధతతో వస్తున్నా రాష్ట్ర ప్రజల కోసం  పాదయాత్రలో 2817 కిలోమీటర్లు ఏకధాటిగా నడిచారు.. దాని ఫలితమే  2014లో టీడీపీ గెలిచిందన్నారు.  హుద్ హుద్ తుఫానుకు ముందు రోజున కోడలు బ్రహ్మణి శ్రీమంతం అయినా సరే కేవలం ఐదే ఐదు నిమిషాలు కుటుంబానికి కేటాయించారని చెప్పారు.  ప్రజల కోసం, వారి  పిల్లల కోసం అర్ధరాత్రిళ్లు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. విభజన సమయంలో కూడా ఆయన కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు. మా  అమ్మగారి తోడ్పాటు వల్లే సీఎం ఇంత కష్టపడగలుగుతున్నారు.  ఆయన త్యాగాలు చూసి అహర్నిశలు సహకరిస్తున్నారు . తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు అంత గొప్ప పేరు వచ్చినా, రాకున్నా వారికి చెడ్డపేరు అయితే తీసుకురానని లోకేష్ స్పష్టం చేసారు .

Related Posts