YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తాత్కాలిక సిబ్బందికి పువ్వులు

తాత్కాలిక సిబ్బందికి పువ్వులు

తాత్కాలిక సిబ్బందికి పువ్వులు
కుమురంభీం అసిఫాబాద్ 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల  సమ్మె 18వ రోజుకు చేరుకుంది. మంగళవారం నాడు   కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆర్టీసీ సమ్మె 18వ రోజులో భాగంగా డ్యూటీలకు వెళ్ళే తాత్కాలిక  డ్రైవర్లను, కండక్టర్ లను మర్యాదపూర్వకంగా  కలిసి, తమ పొట్టలు కొట్టొదని, తమ బతుకులు కాపాడాలని, ఆర్టీసీ ని ప్రైవేటు పరం కాకుండా రక్షించేందుకు సహకరించాలని,మర్యాద పూర్వకంగా పువ్వులు ఇచ్చి, వేసుకుంటూ, నిరసన తెలిపారు.రేపటి నుండి డ్యూటీలకు రావద్దని వేడుకున్నారు.ఈ తాత్కాలిక పోస్టులతో మీకు భవిష్యత్తు లేదని ,తర్వాత ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయితే,  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో భవిష్యత్తులో మీకు సహకరిస్తామని ఆర్టీసీ కార్మికులు ,తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు తెలిపారు.

Related Posts