YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాట మారుస్తున్న చంద్రబాబు

మాట మారుస్తున్న చంద్రబాబు

మాట మారుస్తున్న చంద్రబాబు
తాడేపల్లి  
నారా లోకేష్ ప్రయోజకుడు కాలేదని చంద్రబాబు కలతచెందుతున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో తాము 300 కోట్ల రూపాయల చెక్ సిద్దం చేశామని లోకేష్ అంటున్నారు.  నిజానికి ఆ చెక్ పై సంతకం లేకపోతే అది చెల్లదనే విషయం లోకేష్ తెలియనట్లుగా ఉంది. లోకేష్ ఓ చెల్లని చెక్కు లాంటోడని -ప్రభుత్వ ఛీఫ్ విప్  గడికోటశ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేసారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.ఇవి మానుకోవాలి. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలపై, రాష్ర్ట అభివృధ్దిపై చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్షనేతగా సలహాలు ఇవ్వండి. చంద్రబాబు ఇకపై కూడా నీవు రాయలసీమ,పులివెందుల గుండాలు,రౌడీలు అని వ్యాఖ్యలు చేస్తే  రాయలసీమమహిళలే నీకు వాతలు పెడతారని అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవంనాడు చంద్రబాబు డిజిపి ఖబడ్దార్ అంటూ పోలీసు వ్యవస్దను కించపరిచేలా మాట్లాడారు. మరోవైపు  వైయస్ జగన్ చట్టం ఎవరి చుట్టం కాదు,నిష్ఫక్షపాతంగా పనిచేయాలని చెప్పారు. పోలీసులకు, హోంగార్డులకు భీమా సౌకర్యాన్ని పెంచారు.హోంగార్డులకు వేతనాలు పెంచారు. -పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంటే చంద్రబాబు జలసీ ఫీలవుతున్నారని అయన విమర్శించారు. నవరత్నాలు అమలవుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఓడిపోయాక ఈ దరిద్రం ఇక  పోయిందంటూ ప్రజలు అంటున్నారు. చంద్రబాబు దిగిపోయాక ప్రజలు సంతోషంగా ఉన్నారు.చంద్రబాబు లాంటి వారు రాజకీయంగా కనుమరుగైతే ప్రజలు నిజమైన దీపావళి చేసుకుంటారు.  వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరుణదేవుడు సైతం కరుణించి నేడు అన్నినదులలో నీటిని పారిస్తూ డ్యామ్ లను నింపుతున్నారు. చంద్రబాబు ప్రజలను ప్రాంతాలవారీగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు. దిగజారి మాట్లాడితే ప్రజలే బుద్దిచెప్తారు. ఇసుక కొరత లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయం. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను దోచుకున్నారు. తెలుగుదేశం హయాంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను,కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారు. కాని  జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వేధించవద్దని చెప్పారు. బిజేపి నేతల అంతుచూస్తానని ఎన్నికల సమయంలో మాట్లాడిన చంద్రబాబు నేడు మాటమారుస్తున్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని చంద్రబాబు  కాళ్ల బేరాలాడుతున్నాడు. నరేంద్ర మోదిని, అమిత్ షాను వ్యక్తిగతంగా సైతం విమర్శలు చేసి నేడు తన బినామిలను బిజేపిలోకి పంపారు. రాష్ర్ట అభివృధ్ది అంశాలపై మాత్రమే  జగన్ అమిత్ షా,రవిశంకరప్రసాద్ ఇతర కేంద్ర మంత్రులను అదికారులను కలుస్తున్నారు. చంద్రబాబు లా వ్యక్తిగత అంశాలపై కలవడం లేదు. పచ్చమీడియా జగన్ ఢిల్లీ పర్యటనపై సైతం దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు మైండ్ లో చిప్ వచ్చింది అందువల్ల సంబంధంలేకుండా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్లే ఇంకా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎన్నికలలో చెప్పిన అబద్దాలు నమ్మక చిత్తుచిత్తుగా ఓడించారనే విషయం గుర్తించాలని అయన అన్నారు.

Related Posts