YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అటంకాలు కల్పిస్తున్న విపక్షాలు

అటంకాలు కల్పిస్తున్న విపక్షాలు

అటంకాలు కల్పిస్తున్న విపక్షాలు
హైదరాబాద్ 
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నమైనా, సచివాలయ నిర్మాణం అయినా, మున్సిపల్ ఎన్నికలు విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అటంకాలు కల్పించాలని సృష్టిస్తున్న అడ్డంకులేనని అయన ఆరోపించారు.  దుర్భుద్దితో వేస్తున్న పిటీషన్లతో చివరకు పిటీషన్లు వేస్తున్న వారు అభాసుపాలయ్యారు.  వీరు ప్రభుత్వ సమయాన్ని వృధా చేయగలిగారు తప్పితే సాధించింది ఏమీ లేదు.  ప్రాజెక్టులను కేసులతో అడ్డుకోవాలని ప్రయత్నించారు.  ప్రజలను, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా తాము చేయలేనిది మరెవరూ చేయకూడదు అన్న రీతిలో వ్యవహరించారని విమర్శించారు.  చనిపోయిన వారి పేరు మీద కేసులు వేయించడం విపక్షాల తీరుకు పరాకాష్ట.  సచివాలయం నిర్మాణం అడ్డుకునేందుకూ విఫలయత్నాలు చేసారు.  చివరకు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలను అడ్డుకునే విషయంలో విపక్షాల కుట్రలకు హైకోర్టు తీర్పుతో చెక్ పడింది.  మున్సిపాలిటీ ఎన్నికలలోనూ స్థానిక ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి.  ప్రజలు తమ కోసం, తమ అవసరాలను గుర్తించి పనిచేస్తున్న కేసీఆర్  నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పట్ల అభిమానంతో ఉన్నారు.  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మవడి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా, ఆసరా ఫించన్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పథకాలతో కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం పెంచుకున్నారు.  60 ఏండ్లు పాలించిన వారు కనీసం కరంటు ఇవ్వలేక పోయారు.  ప్రజలు విజ్ఞులు .. వారు అన్నీ గమనిస్తున్నారని మంత్రి అన్నారు.  గత పాలకుల హయాంలో పడ్డ ఇబ్బందులు ప్రజల జ్ఞాపకాల నుండి చెదిరిపోలేదు.  ఎన్నికలు ఏవయినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే.  మున్సిపాలిటీ ఎన్నికలలో గులాబీజెండా ఎగరేస్తామని అయన అన్నారు. 

Related Posts