సింగరేణి సేవా సమితి సేవలను యువత వినియోగించుకోవాలి
ఏరియా జిఎం రమేష్ రావు
మంచిర్యాల
మందమర్రి ఏరియా పరిసర ప్రాంత నిరుద్యోగ యువత భూ నిర్వాసిత, సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల పిల్లలు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సేవలను వినియోగించుకోవాలని మందమర్రి ఏరియా జిఎం రమేష్ రావు పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ ట్రైనింగ్ సైనిక్ అకాడమీ హైదరాబాద్ బాద్ వారిచే భూ నిర్వాసితుల, సింగరేణి రిటైర్ మెంట్ కార్మికుల పిల్లలకు శిక్షణ ఇప్పించడం జరిగింది. శిక్షణ ముగించుకొని వచ్చిన పది మంది యువకులను జి ఎం రమేష్ రావు తన ఛాంబర్లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సమీప గ్రామాల సింగరేణి కార్మికుల, రిటైర్మెంట్ ఉద్యోగుల పిల్లల కోసం సింగరేణి యాజమాన్యం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో ఎప్పుడు డు ముందు ఉంటుందని అందులో భాగంగానే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ సైనిక్ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో యువకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ యువత కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ఈ కార్యక్రమాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ మురళీధర్ రావు పాల్గొన్నారు.