సూగూరు లో భార్య గొంతు పిసికి చంపిన భర్త.
పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం
మంత్రాలయం
కట్టుకున్న భర్తే భార్యను గొంతు పిసికి చంపేసిన సంఘటన మండల పరిధిలోని సూగూరు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని బాస చేసిన భర్త పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే కనీసం కనికరం లేకుండా గొంతు నులిమి హత్య చేశాడు, ఏమి తెలియనట్లు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రాత్రి గ్రామానికి చేరుకునేసరికి అమ్మాయిని చేతులు వెనక్కి విరిచి పెట్టబడి ఉన్నాయి తలదిండు చిరిగిపోయింది. విగతజీవిగా పడివున్న కూతురి ని చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు దుక్క సాగరంలో మునిగిపోయారు. భర్తను ఏం జరిగిందని విచారిస్తే భోంచేసి పడుకోయింది. పాప ఏడిస్తే పిలిచాను కానీ లేవలేదు అప్పటికే చనిపోయింది.ఏం జరిగిందో తెలియదు అని అబద్ధపు మాటలు చెప్పాడని కానీ వాళ్ళు చనిపోతే నీకు తెలియదా మాకు ఎందుకు చెప్పలేదని అల్లుడిని అడిగారు. దీంతో వాళ్ళు తనను ఏమైనా చేస్తారని ముందుగానే పురుగుల మందు పైన చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చేరి పోయాడని తన ప్రాణానికి ఏమీ డోకా లేదని ఆస్పత్రిలో సంతోషంగా ఉన్నాడని తమ ఒక్కగానొక్క కూతురును చంపేసిన అల్లుడిని మామను కూడా శిక్షించాలని తల్లి తండ్రి మేనత్త కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. మా మా కూతుర్ని చంపేశారు ఇప్పుడు ఆ పాపకు పుట్టిన 11 నెలల చిన్నారి భవిష్యత్తు ఏంటి ? తల్లి లేకుండా ఆ చిన్నారి పరిస్థితి ఏంటి అంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మొదటి నుండి ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన సరిగా లేదని అమ్మాయిని చిత్రహింసలు పెట్టే వారిని చుట్టుపక్కలవారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జాలవడి గ్రామానికి చెందిన వడ్డే గోవిందమ్మ నాగరాజు లకు ఒక కూతురు ఇద్దరు కుమారులు సూగూరు గ్రామానికి చెందిన వడ్డే లసుముడుకు స్వయానా చెల్లెలు అయినా గోవిందమ్మ కూతురు కృష్ణవేణిని తన కుమారుడైన వడ్డే మల్లికార్జున కు 7- 5 -2017 న పెళ్లి చేశారు. వారికి మోనిక 11 నెలల పాప కూడా ఉంది. కుటుంబ కలహాలతో భర్త మామ కలిసి తమ కూతుర్ని హత్య చేశారని ఆరోపించారు.ఈ సంఘటన మండలంలో తీవ్ర సంచలనం రేపింది కట్టుకున్న భర్త,సొంత చెల్లెలు కూతురైన కోడలును హత్య చేసిన మామ పరారీలో ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త మామ ల పై ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని హత్య చేసిన భర్త మల్లికార్జున మామ లసుముడును కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను వేడుకున్నారు.స్తానిక సిఐ. కృష్ణయ్య ,తహశీల్దార్ చంద్రశేఖర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను విచారించారు. పంచనామా నిర్వహించిన అనంతరం శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.