Highlights
- వాళ్ళని సోదరి పిల్లలు అని చెప్పింది
- ఆ తర్వాత నిజం చెబితే.. షాక్ అయ్యా
తనను పెళ్లి చేసుకునే సమయానికే హసీన్ కు పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారని క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపారు. ఆ విషయాన్ని తన వద్ద ఆమె దాచి పెట్టిందని తెలిపాడు. పిల్లలు ఎవరని అడిగితే, చనిపోయిన తన సోదరి పిల్లలు అని చెప్పిందని అన్నాడు. షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ ఎన్నో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. కాగా హసీన్ జహాన్ విషయానికి వస్తే, 2002లో ఫషీయుద్దీన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2010లో విడిపోయారు. 2012లో షమీతో ఏర్పడిన పరిచయం 2014లో పెళ్లి కి దారితీసింది. వీరిద్దరికీ ఒక పాప ఉంది. ఈ నేపథ్యంలో, షమీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి, ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి తనకు అసలు విషయాన్ని చెప్పిందని తెలిపాడు. తనకు పెళ్లి అయిందని, ఆ ఇద్దరు పిల్లలు తన పిల్లలే అని చెప్పిందని... దాంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు.