మహిళా రిపోర్టర్ దాడి అమానుషం - మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
గుంటూరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కానీ మీడియాపై దాడులు చేయటం బాధాకరం, అమానుషమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఏపీ 24x7 చానల్ మహిళా రిపోర్టర్ పై ఫిట్‌జీ కళాశాల యాజమాన్యం దాడికి పాల్పడటం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా రిపోర్టర్‌పై దాడి చేసిన కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలి. వైసీపీ పాలనలో మీడియాకు రక్షణ కరువైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే ఒక రిపోర్టర్ హత్యకు గురయ్యాడు, అనేకమంది విలేకర్లుపై దాడులు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని ఆటన డిమాండ్ చేసారు.