దిమ్మె ను నిర్మించారు....
కప్పును మరిచారు..
మట్టితో బురద మయమైన రోడ్డు...
వనపర్తి
మండల కేంద్రమైన గోపాల్పేట బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం పక్కన తాగునీటి సౌకర్యార్థం భారీ స్థాయిలో గుంతలు తీసి చుట్టుముట్టు భారీ స్థాయిలో దిమ్మె ను నిర్మించారు తప్ప దాని పైకప్పును అమర్చేది మార్చారని ప్రజలు, ప్రయాణికులు,షాపుల యజమానులు విమర్శించ సాగారు. ఈ దిమ్మె చుట్టుముట్టు భారీ స్థాయిలో మట్టిని పోయడం వల్ల నడవడానికి, నిలవడానికి ఏమాత్రం వీలు లేక రోడ్డంతా బురద మయమయీ ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సాక్షాత్ ఈ సంఘటన బస్టాండ్ లో జరుగుతుండడం వలన దీని గురించి పట్టించుకునే దేవరిని వారు ప్రశ్నించసాగారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దిమ్మె పైకప్పులు అమర్చి మట్టిని తొలగించి ప్రతి ఒక్కరికి సౌకర్యం కలిగించాలని వారు కోరుతున్నారు.