YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

సాధారణ భక్తులకు కూడా విఐపి బ్రేక్ దర్శనం

సాధారణ భక్తులకు కూడా విఐపి బ్రేక్ దర్శనం

సాధారణ భక్తులకు కూడా విఐపి బ్రేక్ దర్శనం
తిరుమల
శ్రీవాణి ట్రస్ట్ కు పది వేలు కంటే ఎక్కువ నగదు విరాళం ఇచ్చే భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తామని తిరుమల అదనపు ఇఓ ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించే భక్తుల కోసం తిరుమల గోకులం అతిధి గృహం వద్ద ప్రత్యేక కౌన్టర్ లో ప్రారంబించారు. నవంబర్ నుండి యాప్ ద్వారా టికెట్లను పొందేలా చర్యలు చేపడతామన్నారు. పది వేలు విరాళం అందించిన భక్తులకి ఒక విఐపి దర్శనం కల్పిస్తామని ఆ టికెట్టును భక్తులు 500 రూపాయలు ఇచ్చి  పొందాలని తెలిపారు. లక్ష రూపాయలకన్న ఎక్కువ ఇచ్చిన భక్తులకు ఇతర పథకాల ప్రివిలేజ్ అందిస్తామన్నారు. టికెట్ పొందిన భక్తులకు విఐపి బ్రేక్ లో ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తామని అన్నారు. నెల రోజులకి ముందుగానే కోటా విడుదల చేస్తామని...ప్రస్తుతం ఆఫ్ లైన్ లో టికెట్లను కేటాయిస్తామన్నారు. భవిష్యత్తు లో అన్ లైన్ లో  కూడా ఈ స్కీమ్ ఏర్పాటు చేస్తామన్నారు అదనపు ఈఓ ధర్మా రెడ్డి. భక్తులు విరాళం అందిచిన ఆరు నెలలవరకు కాలపరిమితి ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణం చేపడుతామని అంతే కాకుండా పురాతన ఆలయాలు పునరుద్దరణ, పరిరక్షణ కోసం ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. .శ్రీవాణి ట్రస్ట్ కేటాయించే విఐపి దర్శనం ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవని అన్నారు. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కు కోటి పదిలక్షల విరాళంగా భక్తులు అందించారన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టికెట్లను కేటాఇస్తామని పేర్కొన్నారు అదనపు ఈఓ ధర్మా రెడ్డి. 

Related Posts