YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఎస్సెస్సీ బోర్డులో సిబ్బంది కొరత

ఎస్సెస్సీ బోర్డులో సిబ్బంది కొరత

ఎస్సెస్సీ బోర్డులో సిబ్బంది కొరత
హైద్రాబాద్, అక్టోబరు 23, 
తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్సీ బోర్డు). పదో తరగతి, డీఈడీ, ఎన్ టీఎస్ఈ సహా 15కుపైగా ఎగ్జామ్స్ ను నిర్వహించే డిపార్ట్మెంట్ ఇదే. ఏటా సుమారు ఐదున్నర లక్షల మంది స్టూడెంట్లు హాజరయ్యే టెన్త్ ఎగ్జామ్స్ఎస్ఎస్సీ బోర్డుకు ఎంతో కీలకం. కానీ ఈ ఏడాది పదో తరగతి ఎగ్జామ్స్ బోర్డుకే పెద్ద పరీక్షగా మారాయి. దీనికి కారణం సిబ్బంది కొరతే. ఉమ్మడి జిల్లాలకే సరిపోని సిబ్బంది.. 33 జిల్లాలకూ పని చేస్తున్నారు. దీంతో వారిపై పనిభారం పెరుగుతోంది. నెల రోజుల్లో టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్షలుండగా, బోర్డు అధికారులకు రెండు నెలల నుంచే ఎగ్జామ్ టెన్షన్ పట్టుకుంది. సగం పోస్టులు ఖాళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగానికి 138 పోస్టులను కేటాయించారు.ఈ లెక్క పది జిల్లాలకే. అయితే ఇప్పుడు బోర్డు డైరెక్టర్‌ పోస్టుతోపాటు సగం పోస్టులు ఖాళీనే. వయోజన విభాగం బాధ్యతల్లోని అధికారి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్గా వ్యవహరిస్తున్నారు. 10 జిల్లాలు ఇప్పుడు 31 జిల్లాలుగా మారినా పోస్టులు మాత్రం పెరగలేదు. ఒక్కో జిల్లాను పర్యవేక్షించేందుకు బోర్డులో సూపరింటెండెంట్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్‌, అటెండర్‌ ఉండాలి. ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా ఈ సిబ్బంది లేరు. బోర్డులో 35 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులుంటే 11 మందే వర్క్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. స్వీపర్లు, వాచ్‌ మె న్స్‌‌‌‌‌‌‌‌, ఆఫీస్‌ సబార్డినేట్ల పోస్టులూ ఖాళీనే. పాత జిల్లాల పరిధిలోని కొత్త జిల్లాలన్నింటినీ ఒక యూనిట్‌ గా భావించి పనిచేస్తున్నారు. దీంతో ఒక్కో టీమ్‌‌‌‌‌‌‌‌ మూడు, నాలుగు జిల్లాలను పర్యవేక్షించాల్సి వస్తోంది

Related Posts