ఇన్ఫార్మర్ నెపంతో ఒక గిరిజనుడిని చంపిన మావోయిస్టులు
విశాఖపట్నం అక్టోబరు 23,
జీకే వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలు లంబయ్య ( పిల్లలు దివుడు) పోలీసులకు సహకరిస్తున్నాడని మావోయిస్టు జాంబ్రీ ఎన్కౌంటర్ కు దివుడు కారణమని మావోయిస్టుల సమాచారం పోలీసులకు చార వేస్తున్నాడు అనే అనే నెపంతో దివుడు వరి చేను లో ఉండగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మావోయిస్టులు దివుడును అదుపులోకి తీసుకొని రాత్రి 8 గంటల ప్రాంతలో కుంకంపూడి గ్రామ సమీపానికి తీసుకువచ్చి దివుడు పై మూడు రౌండ్లు కాల్పులు జరుపగా, దివుడు అక్కడికక్కడే మరణించాడు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు దిద్దుబాటు చర్యలలో భాగంగా పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న వారిపై గురిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడు అనే నేపంతో దివుడును మావోయిస్టులు హతమార్చారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో గిరిజనుల భయాందోళనలు చెందుతున్నారు....