అమిత్ షా భేటీ వివరాలు బయటపెట్టాలి
విజయవాడ, అక్టోబర్ 23
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటి ఫలప్రదం అయ్యిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా చెపుతారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని,పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడప స్టీల్ ప్లాంట్, రామయనపట్నంపోర్ట్ విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ఇవ్వాలని కోరడం సంతోషం. అసలు రాష్ట్రానికి ఏం ఇస్తామన్నామని అమిత్ షా హామీ ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లారు. అమితశ సమావేశం ఫలప్రదం అర్ధం ఏంటని అయన అన్నారు. ఎంపీకి ఇచ్చిన విలువ సీఎం కి ఇవ్వడంలేదు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించండి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని అయన అన్నారు. 22 మంది ఎంపీ లు ఉన్నా ఎందుకు. 4ఏళ్ల తరువాత మళ్ళీ ధర్మపోరాట దీక్ష చేస్తావా. అమిటీష ఏం హామీ ఇచ్చారో చెప్పకపోతే రాష్ట్రానికి మోసమచేసినట్లేనని అన్నారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అమితశా భేటితో వివరాలు, హామీలపై చర్చించాలి. రాష్ట్రంలో విలేకరులపై దాడులు,హత్యలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు,అధికారులపై దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై ప్రభుత్వం తీరు కక్షసాధింపు చర్య అని అయన అన్నారు. సివిల్ వివాదంలో పోలీసులు తలదూర్చారు. యన్ జి రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై అట్రాసిటి కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని అయన అన్నారు. ప్రభుత్వ చర్యల వలన అధికారులు విధుల్ని స్వేచ్ఛగా నిర్వహించలేరని అన్నారు