నరకాన్ని తలపిస్తున్న రోడ్డు
చోద్యం చూస్తున్న అధికారులు
వనపర్తి అక్టోబర్ 23
మండల కేంద్రమైన గోపాల్పేట బస్టాండ్ లో ఉన్న సాకలిపల్లి బురద మయమైన రోడ్డు నరకాన్ని తలపిస్తున్న కూడా ఏ ఒక్కరూ రోడ్డు పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరంగా ఉందని ప్రజలు ప్రయాణికులు తీవ్ర స్థాయిలో విమర్శించ సాగారు. సుమారు మూడు వందల ఫీట్ల ఉన్న రోడ్డును ఎవరు పట్టించుకోకపోవడం, తీరా రోడ్డుపై మట్టిని పరచడం వల్ల రోడ్డంతా బురద మయమై నడవటానికి నరకయాతన గా మారిందని వారు విమర్శించారు. రోడ్డుపై నడిచేది ఒక ఎత్తయితే వాహనాలు నడిపేది మరొకఎత్తయింది. బురద మయమైన రోడ్డుపై ప్రతిరోజు ద్విచక్ర వాహనాల వారు ప్రమాదాల గురవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా జలమయమై, బురదమయం ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలుగ జేయడమే కాకుండా ఆ ప్రాంతంలోని షాపుల యజమానులకు, ఇండ్ల యజమానులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతు చేయించి ప్రతి ఒక్కరికి సౌకర్యం కలిగించాలని వారు కోరుతున్నారు.