ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య
తుంగతుర్తి అక్టోబర్ 22
పని వత్తిడి భరించలేక టిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పట్టేటి విద్యాసాగర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి, తల్లిని క్షమించమని, ఉరి వేసుకుని తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి విద్యాసాగర్ (32) నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం లోని టిఎస్ ఆర్డబ్ల్యూఎస్ గురుకుల పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. తిప్పర్తి లో స్కూల్ కు సరైన వసతులు లేకపోవడంతో నల్లగొండలో ఆ స్కూల్ ను నిర్వహిస్తున్నారు. దసరా సెలవులకు తన స్వగ్రామమైన అలుగునూర్ కు వచ్చి తల్లి శాంతమ్మ వద్ద ఉంటూ తిరిగి స్కూల్ రీ ఓపెనింగ్ రోజున నల్లగొండ లో నిర్వహిస్తున్న స్కూలుకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ వచ్చింది మంచి జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకున్నా కానీ జాబు లో చేరినప్పటి నుండి ఆనందాన్ని కోల్పోయా, నా పనిని నేను చేసుకోనివ్వకుండా పనికిమాలిన పనులు చెబుతూ రిజల్ట్స్ మంచిగా రావాలి అని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సూసైడ్ నోట్లో వెల్లడించాడు