మున్సిపల్ కమిషనర్లులతో జిల్లా కలెక్టర్ సమావేశం
జగిత్యాల అక్టోబర్ 22
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల కమిషనర్లతో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ తన ఛాంబర్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కావలసిన డంపింగ్ యార్డ్ ఎన్ని ఎకరాలు కావాలి స్థల పరిశీలన, సానిటేషన్ ప్లాన్, పార్కులు, డస్ట్ బిన్ ను ల పంపిణీ, ఇంటింటి చెత్త కలెక్షన్ పబ్లిక్ టాయిలెట్స్, స్వచ్ఛ ఆటోలు, జెసిబి, ఆటో టిప్పర్లు, వీటి గురించి జిల్లాస్థాయిలో ఒకే విధంగా అన్ని మునిసిపాలిటీలలో ఉండునట్లుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి పంపవలసిందిగా ఈ సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రాజేశం, మెట్పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఆర్ డి ఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.