వైద్యుడి నిర్లక్ష్యం వల్ల బాలుడి మృతి
అసిఫాబాద్ అక్టోబర్ 22
కాగజ్ నగర్ పట్టణంలోని కౌసర్ నగర్ కు చెందిన మహమ్మద్ అలీమ్ కుమారునికి న్యూమోనియా సోకడంతో బాలుడ్ని చంద్రాపూర్ లోని పిల్లల ఆసుపత్రి డాక్టర్ ఎం జె ఖాన్ వద్దకు తీసుకెళ్లగా 4 రోజుల క్రితం బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక లక్ష్మీ నర్సింగ్ హోమ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించారు. తొమ్మిది నెలల బాలుడు అయ్యాం ను చంద్రపూరకు తీసుకువెళ్లగా డాక్టర్ ఎం జె ఖాన్ వైద్యం చేయగా 4 రోజుల క్రితం మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక బాలాజీ నర్సింగ్ హోమ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణ ఎస్ఐ రవి కుమార్ చేరుకొని కుటుంబ సభ్యుల ను సముదాయించారు . కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.