టీడీపీ కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేత
ఆసిఫాబాద్ అక్టోబర్ 22
కాగజ్ నగర్ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భోగ నారాయణ భార్య భోగ శారద కు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన రెండు లక్షల రూపాయల చెక్కును జిల్లా అధ్యక్షుడు గుల్లపల్ల ఆనంద్ మంగళవారం అందించారు. పార్టీ కార్యకర్త అయిన భోగ నారాయణ కాగజ్ నగర్ పట్టణములోని వార్డు నెం 22 లో నివాసి. వృత్తిరిత్యా ప్లంబర్ పని చేస్తూ గతంలో ప్రమాదవశాత్తు మరణించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోదని కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తల బాగోగుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి సంక్షేమం చూస్తుందని కొనియాడారు. పేద కార్యకర్తల పిల్లల చదువుకోసం పాఠశాల, పెళ్ళిళ్ళకు పట్టు వస్త్రాలు, వ్యాపారాలకు అవసరమైన ఆర్ధిక సహాయం, వృత్తి శిక్షణా తరగతులు, చికిత్సలకు అవసరమైన ఆర్ధిక సహాయం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సాదిక్ అలీ, జిల్లా కార్యదర్శి సి.హెచ్ శంకర్, రాష్ట్ర మైనారిటి కార్యదర్శి మోసిన్ భేగ్, ప్రచార కార్యదర్శి సురేష్, దహేగాం మండల అధ్యక్షుడు ఎల్.మధుకర్, పట్టణ కార్యదర్శి గులాబ్ రావు, ఇనాయత్ అలీ, గజ్జెల వెంకన్న, సత్యనారాయణ, పొచ్చన్న, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గాడదాసు మల్లయ్య, కోశాధికారి భోగ సత్యనారాయణ, కాలనీ పెద్దలు శంకర్ రావు , సత్యం తదితరులు పాల్గొన్నారు.